- ఉద్యోగ భద్రత కల్పించాలి.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి:NHM
సిరిసిల్ల జిల్లా..NHM ఉద్యోగులు ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, తమకు ఉద్యోగ భద్రత, వేతనాల పరంగా న్యాయం, ఇతర సేవా ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు. ఏళ్ల తరబడి ఆరోగ్య సేవలు అందిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, వేతనాల పెంపు, వార్షిక ఇంక్రిమెంట్లు, ప్రసూతి సెలవులు, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, ఇతర సేవా ప్రయోజనాలు ఉన్నాయి. తమ సేవలను గుర్తించి, ఉద్యోగుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.ప్రజారోగ్య సేవలకు వెన్నెముకగా నిలుస్తున్న NHM సిబ్బంది,గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో NHM ఉద్యోగుల పాత్ర కీలకమైనది. ప్రజలకు నిరంతర ఆరోగ్య సేవలు అందించే సిబ్బంది సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, చర్చల ద్వారా పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు.ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించి, ఉద్యోగులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని NHM ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.