జమ్మి చెట్టుకుపూజ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- దసరా పర్వదినం సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జమ్మి చెట్టుకు శమీ పూజ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం జమ్మి ఆకులను బంగారంగా భావించి ప్రజలకు పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణంలో అలాయ్ బలాయ్ తీసుకుంటూ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.