పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు
- అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన రాజన్న సిరిసిల్ల జిల్లా మహేష్ బి. గీతే
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా అక్టోబర్ 21 బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులోని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.దేశ రక్షణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని వీరులకు నివాళులర్పించారు.పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని ఈ కార్యక్రమం గుర్తు చేసింది.