పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు
- పూల మాల వేసి నివాళులు అర్పించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆద్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వేడుకలు నిర్వహించగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా పండుగ సాయన్న ముదిరాజ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి.. ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన అందించిన సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, జిల్లా సహకార శాఖ అధికారి రామకృష్ణ, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.