🏠 vemulawadavaartha.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 22 October 2026, 9:35 pm Posted by : VEMULAWADA VAARTHA

గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలి

News Image
  • కనీస వేతనం రూ.30 వేలు చెల్లించాలి
  • మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి.
గ్రామ పంచాయతీ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయడంతోపాటు,రెండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) పరిధిలోకి తీసుకువచ్చి కనీస వేతనాన్ని రూ.30 వేలుగా నిర్ణయించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి, గ్రామ పంచాయతీ ఉద్యోగుల,కార్మికుల సంఘం జిల్లా గైడ్ అన్నల్ దాస్ గణేష్ డిమాండ్ చేశారు.గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ అధికారికి యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా సుమారు 56 వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. గ్రామాల పరిశుభ్రత కోసం నిత్యం మురికి కూపాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస రక్షణ పరికరాలు, ఉచిత వైద్య సేవలు అందకపోవడం విచారకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచడంతోపాటు, వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

కార్మికులకు నష్టం కలిగిస్తున్న మల్టీపర్పస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, గతంలో ఉన్న కేటగిరీలను కొనసాగించాలని కోరారు. కార్మికులందరికీ ఆరోగ్య కార్డులు అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అక్టోబర్ 26న నిర్వహించనున్న 'చలో హైదరాబాద్' కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని, ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారిని కోరినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
🏠 Home