🏠 vemulawadavaartha.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 23 October 2026, 2:12 pm Posted by : VEMULAWADA VAARTHA

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

News Image
  • మల్లారం గ్రామంలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
వేములవాడ రూరల్,వీవీన్యూస్
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తూ, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు..శుక్రవారం వేములవాడ రూరల్ మండలం  మల్లారం గ్రామంలో గ్రామంలో నిర్వహించిన సేవా సంకల్ప అభియాన్ డిజిటల్ ఎడ్యుకేషన్ & AI ఎంపవర్‌మెంట్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల్లో కంప్యూటర్ ల్యాబ్‌ను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిజిటల్ విద్యను చేరువ చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం అన్నారు.ఈ చొరవ విద్యార్థులకు నూతన అవకాశాలను అందించి, భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు.ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో నూతన సిలబస్, మెరుగైన విద్యా ప్రమాణాలను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆది శ్రీనివాస్ తెలిపారు.గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అందించే డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యం కల్పిస్తోందని చెప్పారు. విద్యతో పాటు నాణ్యమైన పోషకాహారం అందించాలనే ఆలోచన గతంలో ఆశించిన స్థాయిలో అమలు కాలేదని, ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరహాలో తెలంగాణలోనూ నాణ్యమైన విద్యను అందించే పాఠశాలలు ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వేములవాడ నియోజకవర్గానికి కొండ్రాపోలులో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను తీసుకువచ్చామని, సుమారు 1,500 మంది విద్యార్థులకు విద్యనందించేలా అవకాశం కల్పించామని వివరించారు.ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆరుట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించిన సందర్భంలో తల్లిదండ్రులు వెల్లడించిన అనుభవాలను వారు గుర్తుచేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఆరో తరగతి చదివే విద్యార్థికి ఏడాదికి రూ.60 వేల వరకు ఫీజు చెల్లించాల్సి వచ్చేదని, ప్రభుత్వ పాఠశాలలో అదే స్థాయి విద్య అందుబాటులోకి రావడంతో ఆ మొత్తం ఆదా అవుతోందని ఓ తల్లి ఆనందం వ్యక్తం చేసినట్లు తెలిపారు. మరో విద్యార్థిని తల్లి కూడా కార్పొరేట్ స్థాయి విద్య కోసం చెల్లించాల్సిన సుమారు రూ.లక్ష ఫీజు ఆదా అవుతోందని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.ఆరుట్ల పాఠశాలలో 1,500 మంది విద్యార్థులకు ప్రవేశాలు పూర్తయి, అడ్మిషన్లు లేవని బోర్డు పెట్టే పరిస్థితి రావడం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.విద్యతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ముచ్చర్ల ప్రాంతంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. విద్య అందరికీ అందుబాటులో ఉండటంతో పాటు, విద్యార్థులు ఆధునిక ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని మల్లారం గ్రామంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించడం అవసరమని విప్ అన్నారు.విద్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, గ్రామస్తులు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.. Additional News Photo
🏠 Home