ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి: పొలాస నరేందర్
- తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 లక్షల కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించుటకు కొత్త
- చట్టాలను తయారుకై ప్రభుత్వాలకు విజ్ఞప్తి!
- పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుండి వలస కార్మికుల రాకతో స్థానిక తెలంగాణ కార్మికులకు పని భద్రత లేకుండా పోతుంది!
- నేడు హమాలీ కార్మికుల హక్కుల సాధనకై పెద్దపల్లిలో భారీ రాష్ట్ర సదస్సు!సదస్సుకు తరలిన స్థానిక హమాలీ కార్మికులు
హమాలీ కార్మికుల ఐక్యతకు,హక్కుల సాధనకు ఆదివారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయిలో హమాలీ కార్మికుల బారీ సదస్సు ఏర్పాటు చేశారు.ఈ సదస్సు సందర్భంగా వేములవాడ పట్టణంలోని మొదటి బై పాస్ రోడ్డులో గల మండల హమాలీ కార్యాలయం ముందు మండల హమాలీ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు పొలాస నరేందర్ కార్మిక జెండాను ఆవిష్కరించారు.అనంతరం హమాలీ కార్మికులు నేడు పెద్దపల్లిలో జరుగనున్న హమాలీ కార్మికుల సదస్సుకు తరలి వెళ్లారు.హమాలీ కార్మిక జెండాను ఆవిష్కరించిన అనంతరం కార్మిక సంఘ గౌరవ అధ్యక్షులు పొలాస నరేందర్ మాట్లాడుతూ,కార్మికులందరూ అట్టడుగు బడుగు బలహీన వారని,అణగారిన వర్గాల వారని,దారిద్య్రరేఖకు దిగువనున్న వర్గాలకు చెందిన వారని,విద్య,వైద్యం,నిత్యవసర సరుకుల ధరలు రోజురోజుకు ఆకాశానికి అంటుతుండడంతో ,చాలీ చాలని కూలీలతో,వేతనాలతో సంఘటిత కార్మికులు,అసంఘటి కార్మికులు నానా ఇబ్బందులు పడుచున్నారని నరేందర్ అన్నారు.పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని,హమాలీ కార్మికులకు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో,సమాలోచనలతో,సమష్టిగా"ప్రత్యేక సంక్షేమ బోర్డును"ఏర్పాటు చేసి సంఘటిత, అసంఘటిత రంగాల్లో నున్న కార్మికులను ఆదుకోవాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నరేందర్ విజ్ఞప్తి చేశారు.పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల్లో నుండి వలస కార్మికుల రాకతో ,తెలంగాణలో నున్న సుమారు 10 లక్షల మంది కార్మికులకు పని భద్రత లేకుండా పోతుందనీ,రాబోవు రోజుల్లో ఉపాధి కరువై చాలా నష్ట పోతారని, కష్ట పడతారని నరేందర్ అన్నారు.కార్యక్రమంలో హమాలీ కార్మిక సంఘం అధ్యక్షుడు గజ్జెల శేఖర్,ప్రధాన కార్యదర్శి గుండం బాలయ్య సంఘ నాయకులు సుంకపాక రాజు,జోగిని కిషన్,వావిలాల రాజు,కె.శంకర్ తదితరులు పాల్గొన్నారు.