డీసీసీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం
- రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్
డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్‌ఐఆర్ ఉమ్మడి జిల్లా పరిశీలకులు, ఏఐసీసీ అబ్జర్వర్ శరత్ జీ, ఎస్‌ఐఆర్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ కూన శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు.ఈ సమావేశంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలని సమావేశంలో ప్రాధాన్యతనిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు, వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూమ్ మధు, ఎస్సీ సెల్ నాయకులు ఆకునూరి బాలరాజు, సిరిసిల్ల మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆడపు చంద్రకళ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పండగ ప్రదీప్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడిపల్లి దేవానందం పాల్గొన్నారు.అలాగే పలువురు కౌన్సిలర్లు, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, బొప్ప దేవయ్యతో పాటు పార్టీకి చెందిన వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.