రోడ్లు,డ్రైనేజీ సమస్యలపై MPDO ఆరా
- బీడీ కార్మికుల కాలనీని సందర్శించిన వేములవాడ ఎంపీడీఓ డాక్టర్ బింగి కీర్తన
- సీసీ డ్రైనేజీ,సీసీ రోడ్డు లేక ప్రజల ఇబ్బందులు.. సమస్యలను వివరించిన సర్పంచ్ ముత్త సంజన మహేష్.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి గ్రామంలోని బీడీ కార్మికుల వీధిని మంగళవారం MPDO డాక్టర్ బింగి కీర్తన సందర్శించి,అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ముత్త సంజన మహేష్ స్థానికంగా నెలకొన్న సమస్యలను ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లారు.బీడీ కార్మికుల వీధిలో ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సీసీ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో పాటు,సీసీ రోడ్డు కూడా లేక స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచ్ వివరించారు. వీధిలో మౌలిక సదుపాయాల కొరతను పరిష్కరించి, ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.గ్రామంలోని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని సర్పంచ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఈర్నాల రాజు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.