🏠 vemulawadavaartha.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 28 October 2026, 12:49 pm Posted by : VEMULAWADA VAARTHA

బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

News Image
  • సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్
  • జడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన కార్యక్రమం
బాలలపై లైంగిక వేధింపులను అరికట్టడంతో పాటు, బాలల హక్కులు, రక్షణపై వేములవాడ పట్టణంలోని జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్‌లో బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా పోక్సో (POCSO) చట్టంపై న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేములవాడ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి అజయ్ కుమార్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్ మాట్లాడుతూ బాలలపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పోక్సో చట్టం బాలలకు రక్షణ కల్పించేందుకు రూపొందించబడిందని, బాలలపై వేధింపులు జరిగినప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాలల భద్రత, హక్కుల పరిరక్షణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ బాలల భద్రతకు పోలీసు శాఖ ప్రాధాన్యత ఇస్తుందని, బాలలపై వేధింపులు లేదా అనుమానాస్పద ఘటనలు ఎదురైనప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండటంతో పాటు, తమకు ఎదురయ్యే సమస్యలను నమ్మకమైన పెద్దలతో పంచుకోవాలని, బాలల రక్షణలో పోలీసు శాఖకు ప్రజలు సహకరించాలని తెలిపారు. అనంతరం న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పిట్టల మనోహర్ మాట్లాడుతూ బాలల హక్కులు, భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ఎంతో అవసరమని, ఇలాంటి న్యాయ అవగాహన కార్యక్రమాలు బాలల్లో ధైర్యాన్ని, చట్టాలపై అవగాహనను పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ కోర్టు ఏపీపి, ఏజిపి అవధూత రజనీకాంత్, బొడ్డు ప్రశాంత్ కుమార్, న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షులు గొంటి శంకర్, జాయింట్ సెక్రెటరీ కనికరపు శ్రీనివాస్, మహిళా ప్రతినిధి తమిరి అన్నపూర్ణ, జూనియర్ ఈసీ మెంబర్లు నాయిమా నాసారి, వడ్లకొండ శ్రీకాంత్ న్యాయవాదులు కుంట శ్రీనివాస్, రేగుల రాజ్ కుమార్, బీమా మహేష్ బాబు, నాగేంద్ర, గంప మహేష్, అర్బన్ ఎంఈఓ సదానందం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బన్నాజీ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సిఆర్పి ఆకుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
🏠 Home