🏠 vemulawadavaartha.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 28 October 2026, 10:27 pm Posted by : VEMULAWADA VAARTHA

ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సు

News Image
  • రైతులకు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు.. హన్మాజీపేట రైతు వేదికలో అవగాహన సదస్సు
  • వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయండి:జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మిరాజం,మండల వ్యవసాయ అధికారిణి వినీత రెడ్డి.
వేములవాడ గ్రామీణం,వీవీన్యూస్
ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. రైతులు పంటల సాగులో నష్టాలను తగ్గించుకుని, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామ రైతు వేదికలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులు పంటల సాగులో నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తుగా జారీ చేస్తున్న ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మిరాజం పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని, కూరగాయలు, ఆరుతడి పంటల సాగుపై ఆసక్తి చూపాలని విజ్ఞప్తి చేశారు. ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టడం ద్వారా పంటలపై వాతావరణ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చని వివరించారు.
వేములవాడ రూరల్ మండల వ్యవసాయ అధికారిణి వినీత రెడ్డి మాట్లాడుతూ.. రైతులు వరి సాగుతో పాటు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. నీటి వినియోగాన్ని తగ్గించే ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని, కూరగాయల సాగుతో పాటు వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన పంటలను ఎంచుకోవాలని తెలిపారు. పంటల ఎంపికలో నేల స్వభావం, నీటి లభ్యత, విత్తనాల నాణ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంకె మధు,రూరల్ మండల ఇచార్జి MRO లీలారాణి,TS NPDCL AE,వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామ రైతులు పాల్గొన్నారు. Additional News Photo
🏠 Home