🏠 vemulawadavaartha.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 29 October 2026, 6:44 pm Posted by : VEMULAWADA VAARTHA

నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

News Image
  • చందుర్తి మండలం మూడపెల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయం పనుల పరిశీలన
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.చందుర్తి మండలం మూడపెల్లిలో టీ జీ ఈ డబ్ల్యూ ఐ డీ సీ ఆద్వర్యంలో రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయం పనులు కొనసాగుతుండగా, జిల్లా కలెక్టర్ గురువారం పరిశీలించారు.ఆవరణలో నిర్మాణ పనులు కొనసాగుతుండగా, క్షేత్రస్థాయిలో పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయాలు నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అధికారులు ప్రణాళిక ప్రకారం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పరిశీలనలో వేములవాడ ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ రామకృష్ణ, తహసీల్దార్ భూపతి, ఏఈ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. Additional News Photo
🏠 Home