క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్న అగ్రికల్చర్ విద్యార్థులు
- ఎల్ నినో నేపథ్యంలో రైతులకు ఆరుతడి పంటలు సాగు గురించి చెబుతున్న అగ్రికల్చర్ విద్యార్థులు.
కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన బాబు జగ్జీవన్ రామ్ అగ్రికల్చర్ జిల్లెళ్ళ కళాశాల ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ గ్రామీణ వ్యవసాయ అనుభవ కార్యక్రమం (RAWEP)లో భాగంగా వీరు క్షేత్రస్థాయిలోకి వచ్చారు.రైతులతో నేరుగా మాట్లాడటం,పంటల సాగు విధానాలను పరిశీలించడం,తెగుళ్లు, పురుగుల ఉధృతి,పోషక లోపాలను గుర్తించడం వంటి పనులు చేస్తున్నారు.వేములవాడ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, శాస్త్రవేత్త డాక్టర్ సాయికుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. రైతులకు పంట మార్పిడి విధానంతో పాటు ఆరుతడి పంటలు సాగు ఎలా వేయాలో,చీడపీడల నివారణ చర్యలు అగ్రికల్చర్ అధికారులు,అగ్రికల్చర్ శాస్త్రవేత్తల సూచనలు,సలహాలతో రైతులకు విలువైన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో వెళ్లి అందిస్తున్నారు.ఈ నేపథ్యంలో రైతులు కూడా అగ్రికల్చర్ విద్యార్థులు సాయి భావన,నమ్రత, శాలెం కుమారి, క్రితిక,వాణి,సమ్మిత రెడ్డిల సూచనలు సలహాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.