భూముల రీ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
భూముల రీ సర్వే జరుగుతున్న తీరును తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో కచ్చితంగా పరిశీలించి, సర్వే పారదర్శకంగా జరిగేలా చూడాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.భూముల రీ సర్వే పురోగతిపై శనివారం సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఐడీఓసీ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు సూచనలు చేశారు.రీ సర్వే సమయంలో భూముల హద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సరిహద్దులను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. యజమానులకు ఇబ్బందులు తలెత్తకుండా, సర్వే ప్రక్రియను నిబంధనల ప్రకారం చేపట్టాలన్నారు. సర్వే నిర్వహించే సమయంలో భూముల రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించాలని తెలిపారు.సర్వేలో గుర్తించిన అంశాలను సంబంధిత రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయాలని,ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని సూచించారు.జిల్లాలోని అన్ని మండలాల్లో నాయబ్ తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, మండల, లైసెన్సుడ్ సర్వేయర్లతో మొత్తం 26 బృందాలు భూముల రీ సర్వే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నాయని, నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రక్రియను పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.