🏠 vemulawadavaartha.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 5:27 pm Posted by : VEMULAWADA VAARTHA

హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రిలో అడిషనల్ కలెక్టర్ తనిఖీ

News Image
హుజూరాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో వైద్య సేవల నిర్వహణ, సిబ్బంది పనితీరును కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే శనివారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను సందర్శించి అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి విభాగంలో రిజిస్టర్లను తనిఖీ చేసి, వైద్య సిబ్బంది నుంచి విధుల నిర్వహణ, రోగులకు అందిస్తున్న సేవలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యం కోసం వచ్చిన రోగులతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు.

**ప్రతి విభాగంలో రిజిస్టర్ల పరిశీలన**

ఫిమేల్ సర్జికల్ క్లినిక్, ఓపీడీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, సర్జికల్ ఓపీ, ప్రాథమిక పరీక్షల గది, ఎక్స్‌రే గది, అత్యవసర చికిత్స విభాగం, డయాలసిస్ కేంద్రం, లేబర్ రూమ్ వెటర్నరీ వార్డ్ తదితర విభాగాలను సందర్శించారు. ఆయా విభాగాల్లో రిజిస్టర్లను పరిశీలిస్తూ సిబ్బంది హాజరు, విధుల కేటాయింపు, రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలను తెలుసుకున్నారు. ప్రతిరోజూ ఎంతమంది రోగులు, గర్భిణులు, చిన్నారులు వస్తున్నారు? వారికి అందిస్తున్న వైద్య సేవలు ఎలా ఉన్నాయి? అని వైద్య సిబ్బందిని ప్రశ్నించారు.

ఆస్పత్రిలోని మందుల నిల్వ గదిని పరిశీలించి అందుబాటులో ఉన్న మందులు, వాటి నిల్వలు, వివిధ విభాగాలకు సరఫరా చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మందులు సరఫరా చేయకముందే రిజిస్టర్లలో నమోదు చేస్తున్న విషయాన్ని గుర్తించి అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవంగా మందులు సరఫరా చేసిన తర్వాతే రికార్డుల్లో నమోదు చేయాలని, రికార్డుల నిర్వహణలో ఇలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని హెచ్చరించారు. అనస్థీషియాకు సంబంధించిన ఇంజక్షన్ల వినియోగ రికార్డుల్లోనూ వ్యత్యాసాలు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మందులు, ఇంజక్షన్ల వినియోగానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.

**రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి**

అనంతరం ఆర్ఎంఓ ఛాంబర్‌లో డీసీహెచ్‌ఎస్, ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్యాధికారులతో అడిషనల్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వర్తించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై పేదలు, సామాన్య ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలని, ప్రతి రోగికి మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ తనిఖీలో అసిస్టెంట్ కలెక్టర్ హరిప్రసాద్, మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, ఆర్డీఓ జలకుమారి, ఆస్పత్రి సూపరింటెండెంట్ రవీందర్, తహసీల్దార్ నరేందర్‌తో పాటు వైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. Additional News Photo
🏠 Home