వృత్తి విద్యా శిక్షణలో భాగంగా కరీంనగర్ డైరీ,పొలాస వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన విద్యార్థులు
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వృత్తి విద్యా శిక్షణలో భాగంగా కరీంనగర్ డైరీ, జగిత్యాల జిల్లాలోని పొలాస వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు క్షేత్రస్థాయిలో వివిధ వృత్తులకు సంబంధించిన విధానాలు, ఉత్పత్తి ప్రక్రియలు, వ్యవసాయ పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పొందారు. పుస్తకాల్లో నేర్చుకున్న అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం కలిగింది.ఇలాంటి క్షేత్రస్థాయి సందర్శనలు విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేందుకు దోహదపడతాయని ఉపాధ్యాయులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు బాబు, సంగీత, రమేష్, బాలయ్య, భరత్, భాస్కర్ రెడ్డి, పద్మ, ఉమామహేశ్వరి పాల్గొన్నారు.