ఇలా అయితే రాకపోకలు సాగించేదెలా?
- రహదారిపైకి చేరుతున్న మురికినీరు.. లీకేజీతో వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీరు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 13వ వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో స్థానిక ప్రజలు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేములవాడ నుంచి మల్లారం, మరిమడ్ల మీదుగా నిజామాబాద్ జిల్లాకు వెళ్లే ప్రధాన రహదారిపైకి మురుగునీరు చేరుతుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రహదారిపై మురుగునీరు నిల్వ ఉండటంతో వాహనదారులు ప్రమాదాల భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.మరోవైపు మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ కారణంగా తాగునీరు సైతం రోడ్డుపైకి చేరి వృథాగా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ సమస్యకు తోడు పైప్‌లైన్ లీకేజీతో రహదారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు.రహదారిపై మురుగునీరు చేరి ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో స్పందించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు పైప్‌లైన్ లీకేజీని వెంటనే అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.నీటిని వృధా చెయ్యొద్దు,పొదుపు చేయాలని ప్రభుత్వం,అధికారులు అనేక ఎల్ నినో పేరుతో చేస్తున్నారు.మిషన్ భగీరథ నీరు వృథాగా పోతున్న పట్టించుకోవడం విమర్శలకు తావిస్తుంది.