గర్భిణీలకు ఆరోగ్యంపై అవగాహన
- రుద్రవరం అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం కార్యక్రమం
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రవరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన కల్పించారు. గర్భిణీల బరువు, ఎత్తు, రక్తహీనత వంటి అంశాలను పరిశీలిస్తూ,రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం ప్రాధాన్యత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ ఊరడి సునీత రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా..ముఖ్య అతిథులుగా జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్,వేములవాడ ఎంపీడీఓ కీర్తన, పంచాయతీ కార్యదర్శి మనీషా పాల్గొన్నారు.అనంతరం గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యత, వడ్డింపు విధానాన్ని పరిశీలిస్తూ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తునికి స్వరూప నరేష్, ఎరుకలి రజిత కిషన్ రెడ్డి, పార్వతి భూమేష్ గౌడ్, గుండెల్లి శ్రీనివాస్, వంకాయల మహేశ్వర్, గర్భిణీ స్త్రీలు, అంగన్వాడీ టీచర్, సూపర్‌వైజర్ శశి కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.