వేములవాడలో విజయలక్ష్మి ఫైర్ వర్క్స్ ప్రారంభించిన విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ పట్టణంలోని నంది కమాన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విజయలక్ష్మి ఫైర్ వర్క్స్ పటాసుల దుకాణాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు..ఈ సందర్భంగా దుకాణాన్ని ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపార రంగంలో అభివృద్ధి సాధిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.కాంగ్రెస్ పార్టీ నేతలు,యజమాని ఎర్ర శ్రీనివాస్ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ఉన్నారు. కార్యక్రమానికి చేరుకోగానే యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికి సన్మానించి సత్కరించారు. పట్టణ ప్రముఖులు సైతం హాజరయ్యారు.