ప్రభుత్వ విద్యాలయాల్లో సకల సౌకర్యాలు
- విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి, వసతి గదులు, మౌలిక వసతుల కల్పన.
- ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
రూ. 95 లక్షల 50వేలతో కేజీబీవీలో వసతి గదులు, టాయిలెట్స్, భవిత కేంద్రం, ఐకేపీ గోడౌన్ నిర్మాణానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి శంకుస్థాపన.ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రజా ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.56 లక్షలతో నూతన వసతి గృహం, టాయిలెట్స్, రూ. 9 లక్షల 50 వేలతో భవిత కేంద్ర నిర్మాణానికి, రూ. 30 లక్షలతో ఐకేపీ గోడౌన్ నిర్మాణానికి గురువారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించగా... ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై శిలాఫలకాన్ని కాలనీ ఆవిష్కరించి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతన తరగతి, వసతి గదులు, మౌలిక వసతుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నదని వివరించారు. అలాగే అన్ని విద్యాలయాల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులకు కాస్మోటిక్, డైట్ చార్జీలు పెంచిందని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని, అలాగే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను నిర్మించనున్నదని అని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిందని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది స్పష్టం చేశారు. విద్యార్థులు వసతులు సద్వినియోగం చేసుకోవాలని, మంచిగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.కేజీబీవీ, భవిత సెంటర్, ఐకేపీ గోడౌన్ నిర్మాణ పనులను త్వరితగతిన మొదలుపెట్టి గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఆయా పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.కోనరావుపేట మండల కేంద్రంలో రూ. 30 లక్షలతో ఐకేపీ గోడౌన్ నిర్మాణానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం భూమి పూజ చేశారు. గోడౌన్ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, ఫ్యాక్స్ ఛైర్మెన్లు చేపూరి గంగాధర్, బొమ్మేన భాస్కర్ రావు, ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి,డీఆర్డీఓ లక్ష్మీనారాయణ,కోనరావుపేట సర్పంచ్ కాశిరామ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు బోయిని దేవరాజు,తహసీల్దార్ వరలక్ష్మి,ఎంపీడీఓ స్నిగ్ధ,జీసీడీఓ పద్మజ తదితరులు పాల్గొన్నారు.