చెకుముకి టాలెంట్ టెస్ట్-2026 పోస్టర్ ఆవిష్కరణ
రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ చెకుముకి టాలెంట్ టెస్ట్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడుతూ బాల్య దశనుంచే చిన్నపిల్లలలో సైంటిఫిక్ టెంపర్ ను పెంపొందించడానికి జన విజ్ఞాన వేదిక చేస్తున్నటువంటి కృషి అభినందనీయం అన్నారు అంతేకాకుండా విద్యార్థులలో సృజనాత్మకతను,తార్కికఆలోచన జ్ఞానాన్ని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందిస్తుందని తెలియజేశారు.జిల్లా అధ్యక్షులు పారం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్ష చెకుముకి టాలెంట్ టెస్ట్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తా ఉంది చెకుముకి సైన్స్ సంబురాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగు దశల్లో... పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లాస్థాయి, ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తాన్నది.విద్యార్థుల్లో సైన్స్ పట్ల అసక్తిని కల్గించడానికి, పరిశీలనా శక్తిని పెంచడానికి, శాస్త్రీయ ధృక్పథం అలవర్చడానికి, సృజనాత్మతకతను పెంపొందించేందుకు, వారిలో దాగివున్న అంతర్గత శక్తులను వెలికితీసేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది విద్యార్థులకు "చెకుముకి సైన్స్ సంబురాలు" పేరుతో ప్రతిభా పాటవ పరీక్షల్ని గత 37 సంవత్సరాలుగా జనవిజ్ఞాన వేదిక నిర్వహిస్తోంది.
జిల్లా ప్రధాన కార్యదర్శి ద్యావనపల్లి శ్రీహరి మాట్లాడుతూ చెకుముకి టాలెంట్ టెస్ట్ లో ప్రతి హై స్కూల్ నుండి 8వ తరగతి, 9వ తరగత 10వ తరగతి చెందిన విద్యార్థులు పాల్గొంటారు.
1) School Level -12th November 2026
2) Mandal Level -21st November 2026
3) District Level -28th November 2026
4) State Level -11th, 12th and 13th December 2026.
పై షెడ్యూల్ ప్రకారం మండల కన్వీనర్ లు కోకన్వీనర్లు సమాచారం అందించి టెస్టును విజయవంతం నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు సంపత్ కుమార్,జిల్లా ఉపాధ్యక్షులు బుర్క గోపాల్,గంప లక్ష్మీనారాయణ, జి.రాజలింగం, జిల్లా కార్యదర్శి రంజిత్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు