అనారోగ్యంతో శ్మశానానికి...ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాలతో ఐసీయూలో చికిత్స
- నిరుపేదలకు అండగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. శ్మశానవాటికలో ఉన్న బాధితుడికి ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం
- కుమారుడి ప్రాణాల కోసం తల్లి తాపత్రయం.. తక్షణమే స్పందించి అండగా నిలిచిన మున్సిపల్ యంత్రాంగం.
- వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ,పూర్తి సహకారం అందిస్తామని భరోసా
వేములవాడ పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతూ, శ్మశానవాటికలో ఆశ్రయం పొందిన దయనీయ ఘటనపై శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తక్షణమే స్పందించారు. చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన అమృత గత ఐదేళ్లుగా వేములవాడలో నివాసం ఉంటోంది,తన కుమారుడు తీవ్ర అనారోగ్యంతో ఉండడంతో తీవ్ర ఆవేదనతో కుమారుడితో కలిసి శ్మశానవాటికలో తలదాచుకుంది. ఈ హృదయవిదారక పరిస్థితిపై స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు తక్షణమే స్పందించి బాధితులకు అండగా నిలవాలని మున్సిపల్ పాలకవర్గానికి అధికారుల ను ఆదేశించారు. ఆయన సూచనల మేరకు వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు గారు,మున్సిపల్ కమిషనర్ లోకేష్ గారి తో కలిసి పేషంట్ మరిపల్లి రాకేష్ ను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి
ఈ సందర్భంగా *మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు గారు* మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో మర్రిపల్లి రాకేష్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడని తెలిపారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న దృష్ట్యా, వారు ఉంటున్న అద్దె ఇల్లు ఖాళీ చేయించడంతో,ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని బయటకు తీసుకురావాల్సిన అత్యంత దయనీయ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని కాపాడుకోవడానికి ఆ తల్లి అమృత పడుతున్న ఆవేదనను గమనించి, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి సమస్యను తెలియజేయగానే ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించారని ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రాకేష్‌ను వెంటనే సిరిసిల్ల లోని ఏరియా ఆసుపత్రికి తరలించి, తగిన చికిత్స అందించడం కోసం వైద్యులతో మాట్లాడి ఐసీయూలో చేర్పించడం జరిగిందని ఎమ్మెల్యే గారి సూచనలతో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు తక్షణమే స్పందించి రోగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ఐసీయూలో మెరుగైన వైద్య చికిత్సను కూడా ప్రారంభించారని వారన్నారు. వారి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్ కొండా రాజశేఖర్, నాయకులు మూడపెళ్లి నాగరాజు తదితరులు ఉన్నారు.ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం తరఫున బాధితులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని, బాధితుల కుటుంబానికి నిరంతరం అండగా ఉంటామని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు భరోసా ఇచ్చారు.