బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమం
- బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యం,పరిశుభ్రత,పోషకాహారంపై ఓరియంటేషన్ కార్యక్రమం
బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యం, పరిశుభ్రత మరియు పోషకాహారంపై ఓరియంటేషన్ కార్యక్రమం.మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారిక కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో కార్యక్రమాల్లో భాగంగా గ్రామ ఆరోగ్యం, పారిశుధ్యం మరియు పోషకాహార కమిటీ (VHSNC) సభ్యులు,అంగన్వాడీ టీచర్లు,ఆశా కార్యకర్తలకు ఆరోగ్యం,పరిశుభ్రత,పోషకాహారంపై ఓరియంటేషన్ కార్యక్రమం జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే గారు మాట్లాడుతూ గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆశా కార్యకర్తలు మరియు అంగన్వాడీ టీచర్లు ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, పరిశుభ్రత పాటించే VHSNC కమిటీలను సన్మానించడం జరుగుతుందని తెలిపారు.అనంతరం ఆరోగ్య శాఖ నుండి సులోచన VHSNC కమిటీల బాధ్యతలు, గర్భిణీలు,బాలింతలు మరియు పిల్లల ఆరోగ్య సంరక్షణ గురించి వివరించారు.స్వచ్ఛ భారత్ మిషన్ నుండి రమేష్ గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తడి చెత్త,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం,మరుగుదొడ్లను ఉపయోగించడం గురించి అవగాహన కల్పించారు.
KVK సైంటిస్ట్ ప్రశాంతి మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.రాకెట్ లెర్నింగ్ సంస్థ ద్వారా అంగన్వాడీ టీచర్లకు సర్టిఫికెట్ అందించారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ అడిషనల్ DM&HO ప్రభుదాస్,మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ శ్రీలత,చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ సంపత్, సఖి అడ్మిన్ లక్ష్మి,మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది, ఎక్స్టెన్షన్ ఆఫీసర్,ఐసిడిఎస్ సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బంది,ఏఎన్ఎంలు,అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.