- ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగ సంబరాలు
దీపావళి పండుగను పురస్కరించుకొని గ్రామంలో ఇందిరమ్మ ఇంట్లో పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని చంద్రగిరి గ్రామ సర్పంచ్ ముత్త సంజన మహేష్, ఉప సర్పంచ్ ఈర్నాల రాజు,వార్డు సభ్యులు సుదర్శన్,పంచాయతీ సెక్రటరీ నిట్టు నరేష్, ప్రజాప్రతినిధులు ఇమామ్ భీమని మహేష్, శ్రీనివాస్,పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ ముత్త సంజన మహేష్ మాట్లాడుతూ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం పెంపొందించేలా పండుగలను అందరూ కలిసి జరుపుకోవాలని తెలిపారు.