*అభిమానాన్ని చాటుకున్న ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు
- లబ్ధిదారులు తిప్పారపు సత్తమ్మ ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే ఇందిరమ్మ పాలన లక్ష్యం అనే నినాదానికి తమ ఇల్లు ఒక నిదర్శనమని లబ్ధిదారు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూసిన తమకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత గూడు లభించిందని, తమ కుటుంబానికి భరోసా కల్పించిన ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు.
ఈ సందర్భంగా తమ సొంతింటి కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఈ అభిమానం.. ప్రజల ఆశలను నెరవేర్చిన సంక్షేమ పాలనకు, తమ జీవితాల్లో వచ్చిన మార్పుకు వారు వ్యక్తం చేస్తున్న కృతజ్ఞతకు ప్రతిబింబంగా నిలుస్తోంది.