🏠 vemulawadavaartha.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 08 November 2026, 6:31 pm Posted by : VEMULAWADA VAARTHA

మీకు వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వండి

News Image
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని జగిత్యాల బస్టాండ్ ప్రాంతంలో గల వైన్స్ వెనుక ఉన్న బావిలో గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యమైనట్లు వేములవాడ పట్టణ పోలీసులు తెలిపారు.మృతుడి వయస్సు సుమారు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా మృతుడు టీషర్ట్,జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు.మృతుడి కుడి చేతిపై “ఊర్మిళ ఐ లవ్ యు” అనే అక్షరాలతో పాటు త్రిశూలం, డమరుకం మరియు ఓంకారం గుర్తులతో కూడిన పచ్చబొట్లు (Tattoos) ఉన్నాయి.మృతుడిని గుర్తించిన వారు లేదా మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలు తెలిసిన వారు వెంటనే వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్‌ను 8712656413 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రజలు ఈ సమాచారాన్ని సోషల్ మీడియా మరియు ఇతర మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి, గుర్తుతెలియని మృతుడి గుర్తింపునకు సహకరించాలని వేములవాడ పట్టణ పోలీసులు కోరుతున్నారు.
🏠 Home