🏠 vemulawadavaartha.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 08 November 2026, 8:59 pm Posted by : VEMULAWADA VAARTHA

వెంకటంపల్లిలో ఘనంగా దీపావళి వేడుకలు – సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

News Image
  • ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి.. సీఎం జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వెంకటంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ ఇళ్లలో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా దీపావళి పండుగను జరుపుకున్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆవునూరి లక్ష్మి–చిన్న నర్సయ్య ఆధ్వర్యంలో గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లను సందర్శించారు. గ్రామానికి చెందిన లబ్ధిదారులు ప్రజాప్రతినిధులకు ఆప్యాయంగా స్వాగతం పలికి, స్వీట్లు అందజేస్తూ, టపాసులు కాల్చి ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత ఇంటి కల సాకారమవడంతో లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి,గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను గ్రామ సర్పంచ్ ఆవునూరి లక్ష్మి–చిన్న నర్సయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, టపాసులు కాల్చి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ వెలిశాల మల్లేశం, ఆత్మ కమిటీ డైరెక్టర్ బండ శ్రీనివాస్ యాదవ్, వార్డు సభ్యులు బండ బాబు, పసునూరి స్వరూప, ఆవునూరి లక్ష్మి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మైలవరం సుమలత, మార రాజవ్వ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పసునూరి పరశురాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్మోజి గోపాల్, మైలవరం రాజేందర్, లక్కపత్తిని దేవయ్య, నగర్ల దేవయ్య, గోగురి మధు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ మహిళలు, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. Additional News Photo
🏠 Home