🏠 vemulawadavaartha.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 09 November 2026, 12:24 am Posted by : VEMULAWADA VAARTHA

ఘనంగా దీపావళి పండుగ వేడుకలు

News Image
  • కుటుంబ సభ్యులతో వ్యాపార సముదాయాల వద్ద దీపావళి వేడుకలు నిర్వహించిన కౌన్సిలర్ కొక్కుల బాలకృష్ణ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆదివారం ఘనంగా దీపావళి వేడుకలు జరిగాయి. పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతంలోని వారి కుటుంబ సభ్యుల వ్యాపార సముదాయాల వద్ద 25వ వార్డు కౌన్సిలర్ కొక్కుల బాలకృష్ణ కుటుంబ సమేతంగా హాజరై దీపావళి వేడుకలు నిర్వహించారు. సందర్భంగా అందరూ వ్యాపార సముదాయాలలో పూజలు నిర్వహించారు అనంతరం ఆప్యాయంగా స్వీట్స్ పంపిణీ చేసి, టపాసులు పేలుస్తూ.. ఆనందంగా పండుగను జరుపుకున్నారు. తన సోదరుడు కొక్కుల భానుచందర్ లత దంపతుల పెళ్లిరోజు కావడంతో కుటుంబ సభ్యులందరూ కేక్ కట్ చేసి పెళ్లిరోజు శుభాకాంక్షలతో పాటు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కొక్కుల దేవయ్య శాంత దంపతులు వారి కుమారులతో పాటు కుమార్తెలను కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు.వేములవాడ రాజన్నస్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు. Additional News Photo
🏠 Home