సీఎం సభకు భారీగా జన సమీకరణ
- సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు,ఎమ్మెల్యేలు
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 'ఇంటింటా ఇందిరా కుటుంబం' పథకంతో పాటు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు బోనస్, రుణమాఫీ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు సిద్దిపేటకు సమీపంలోని దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, సిరిసిల్ల, మానకొండూరు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. సభకు భారీగా జన సమీకరణ చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.