మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
- నివాళులర్పించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
స్వాతంత్ర సమర యోధుడు, భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల కార్యక్రమాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరై మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో, దేశ విద్యా వ్యవస్థ నిర్మాణంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ అందించిన సేవలను కొనియాడారు.ఇక్కడ జిల్లా రెవెన్యూ శాఖ అధికారి, ఇంచార్జి మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి జయశ్రీ, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.