- తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDUGKY) పథకం ద్వారా ఉచిత శిక్షణ...
యాదాద్రి భువనగిరి జిల్లా వేములవాడ వార్త :గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ శుభవార్త అందించింది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ – తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDUGKY) పథకం ద్వారా ఉచిత శిక్షణ అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది.జలాల్పూర్, భూదాన్ పోచంపల్లి మండలంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉచిత భోజనం, వసతి సౌకర్యాలతో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ వెల్లడించింది. కోర్సుల వివరాలు:1. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ (టాలీ ప్రైమ్) – 3 నెలల శిక్షణ. బీకాం ఉత్తీర్ణులై, 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.2. ఆటోమొబైల్ – టూ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ – 3 నెలల శిక్షణ. పదో తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.అభ్యర్థులు ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఫోటోలతో సంస్థలో హాజరు కావాలని సూచించారు.ప్రవేశ తేదీ:18-11-2026, బుధవారం.అభ్యర్థులు హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్, హయత్నగర్ నుంచి సంస్థకు చేరుకోవడానికి బస్సు నంబర్ 524 ద్వారా ప్రయాణించవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.మరిన్ని వివరాలకు 9133908000, 9505625488, 9133908222, 9948466111 నంబర్లను సంప్రదించాలని సంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్. కిషోర్ రెడ్డి తెలిపారు.