- శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతులకు మెరుగైన ఆదాయం:రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వేములవాడ, బాబు జగ్జీవన్ రామ్ సిరిసిల్ల, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల పొలాస వారి ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ ప్రదర్శన స్టాళ్లను ఆది శ్రీనివాస్ సందర్శించి, వాటిలో ప్రదర్శించిన ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాగు విధానాలు, పంటల మార్పిడి, నేల సార పరీక్షలు, రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.