- పిల్లలంటే నెహ్రూకు ఎంతో ప్రేమ. అందుకే చిన్నారులు ఆయనను ప్రేమగా 'చాచా నెహ్రూ' అని పిలిచేవారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా వేములవాడ వార్త.. చిల్డ్రన్స్ డే సందర్భంగా నకరేకల్ లోని నాగరాజు స్కూల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంధ్యల నాగరాజు మాట్లాడుతూ..దేశ భవిష్యత్తుకు బాలలే పునాదులు.. వారి ఆలోచనల్లోనే రేపటి అభివృద్ధి దాగి ఉంది. చిన్నారుల నవ్వులు, ఆటపాటలు, అల్లరి చేష్టలతో ప్రతి ఇల్లు సందడిగా మారుతుంది. అలాంటి బాలల హక్కులు, విద్య, ఆరోగ్యం, భద్రతపై సమాజంలో అవగాహన కల్పించడమే బాలల దినోత్సవం ముఖ్య ఉద్దేశం.భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 14న దేశవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. పిల్లలంటే నెహ్రూకు ఎంతో ప్రేమ. అందుకే చిన్నారులు ఆయనను ప్రేమగా 'చాచా నెహ్రూ' అని పిలిచేవారు.ఈ రోజు మా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటల పోటీలు, వ్యాసరచన, చిత్రలేఖనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు ప్రోత్సహించారు.అయితే బాలల దినోత్సవం అంటే కేవలం వేడుకలు నిర్వహించుకోవడమే కాదు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, ఆరోగ్యం, సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వంతో పాటు సమాజంపై కూడా ఉంది.బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, బాలలపై వేధింపులు వంటి సమస్యలను అరికట్టి ప్రతి చిన్నారికి సురక్షితమైన బాల్యాన్ని అందించాలి అని తెలిపారు . పిల్లల కలలకు రెక్కలు తొడిగి, వారి ప్రతిభకు సరైన ప్రోత్సాహం అందించినప్పుడే బంగారు భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుంది తెలిపారు.పిల్లలను ప్రేమిద్దాం.. వారి హక్కులను కాపాడుదాం.. వారి కలలను నిజం చేద్దాం.. బాలలే రేపటి భారతానికి వెలుగుదివ్వెలు అని అన్నారు.