🏠 vemulawadavaartha.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 15 November 2026, 7:03 pm Posted by : VEMULAWADA VAARTHA

బాలాలయంలో వెదురుతో చేసిన స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు

News Image
  • కొండగట్టు అంజన్నస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట కొండపై వెలసిన కొండగట్టు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 60 సంవత్సరాల తర్వాత చందనోత్సవ పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా మూలవిరాట్ పై ఉన్నటువంటి చందనం తొలగింపు ప్రక్రియ శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయంలో బాలయాలయంలో చెక్కతో తయారు చేసిన ప్రతిమకు చందనం స్వామి వారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు వచ్చి చెక్కతో (కలప) తయారు చేసిన స్వామివారిని దర్శించుకున్న దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈనెల 15 వ తేదీ నుంచి అంటే ఈరోజు నుంచి 20వ తేదీ వరకు స్వామివారి దర్శనం నిలిపివేసి, భక్తులకు ప్రత్యామ్నాయంగా బాలయాలయంలో వెదురుతో చేసిన స్వామివారు దర్శనమిస్తున్నారు. అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. Additional News Photo
🏠 Home