- వేములవాడ అర్బన్,వీవీ న్యూస్
పేదల సంక్షేమం,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.గరీబీ హఠావో,కూడు,గూడు,గుడ్డ నినాదాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని పేర్కొన్నారు. దేశంలో పేదల సంక్షేమానికి నిజమైన పునాది వేసింది ఇందిరమ్మ రాజ్యమేనని స్పష్టం చేశారు.సోమవారం వేములవాడ అర్బన్ మండల చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఎంపీడీవో కీర్తనతో కలిసి మంజూరు పత్రలను అందజేశారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒకవైపు అభివృద్ధి,మరోవైపు సంక్షేమాన్ని సమాంతరంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. మనిషికి రెండు కళ్లల అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గ్రామంలో,ప్రతి గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో అర్హులైన పేదలకు కొత్తగా 8,052 పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ఆది శ్రీనివాస్ వెల్లడించారు.వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, దివ్యాంగులు తదితర అర్హులైన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.