🏠 vemulawadavaartha.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 9:18 pm Posted by : VEMULAWADA VAARTHA

భీమేశ్వర ఆలయంలో వైభవంగా సామూహిక కార్తీక దీపోత్సవం

News Image
వేములవాడ,వీవీ న్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సామూహిక కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా, 7వ రోజు వేడుకలను రాజన్న ఆలయ ఈవో రమాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నవంబర్ 10వ తేదీ నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పవిత్ర కార్తీక మాస పర్వదినాల సందర్భంగా,ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సుహాసినుల ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో సామూహిక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తులు మరియు శ్రీరాజరాజేశ్వరి సేవాసమితి సభ్యులకు ఆలయ అర్చకులు,అధికారులు పసుపు,కుంకుమ, అక్షింతలు,గాజులు,వాయనంతో పాటు శ్రీస్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. Additional News Photo
🏠 Home