🏠 vemulawadavaartha.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 17 November 2026, 9:49 pm Posted by : VEMULAWADA VAARTHA

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా గోపాష్టమి వేడుకలు

News Image
  • రాజన్న సిరిసిల్ల జిల్లా గోరక్ష ప్రముఖ్‌గా గన్నమనేని ప్రదీప్ రావు నియామకం
వేములవాడ టౌన్,వీవీ న్యూస్
కార్తీక శుద్ధ అష్టమి (గోపాష్టమి) పర్వదినాన్ని పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్ (VHP) ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని శ్రీగాయత్రి దేవాలయంలో గోపూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి,గ్రాసం సమర్పించారు. భారతీయ సంస్కృతిలో గోవుకు ఉన్న విశిష్ట స్థానాన్ని వివరిస్తూ, ప్రతి ఒక్కరూ గోసంరక్షణకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.అదేవిధంగా, ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ నూతన గోరక్ష ప్రముఖ్‌గా గన్నమనేని ప్రదీప్ రావు నియమితులైనట్లు నాయకులు ప్రకటించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన క్షేత్ర ప్రముఖ్ గుమ్మల సత్యం జీ, విభాగ్ సహ కార్యదర్శి గజం రాజు, జిల్లా కార్యదర్శి గడప కిషోర్ రావు మరియు జిల్లా ఉపాధ్యక్షులు నాగుల రాము గౌడ్ గార్లకు గన్నమనేని ప్రదీప్ రావు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.నూతన బాధ్యతలు చేపట్టిన ఆయనకు నాయకులు,కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో క్షేత్ర ప్రముఖ్ గుమ్మల సత్యం,విభాగ్ సహ కార్యదర్శి గజం రాజు,జిల్లా కార్యదర్శి గడప కిషోర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు నాగుల రాము గౌడ్,వేములవాడ పట్టణ అధ్యక్షులు పల్లె శ్యామ్ సుందర్ రెడ్డి,పట్టణ కార్యదర్శి గుండోజు గోపాల్ తో పాటు సనుగుల భాస్కర్, తిప్పర్తి సాయి కృష్ణ,తిప్పర్తి రమేష్,దండి గణేష్, కొక్కు గోపాలకృష్ణ,నంది శివ కుమార్ తదితర కార్యకర్తలు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Additional News Photo
🏠 Home