🏠 vemulawadavaartha.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 3:18 pm Posted by : VEMULAWADA VAARTHA

మాట తప్పారు: BRS వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్మినరసింహారావు

News Image
రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్
దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆలయ ప్రధాన గోపురాన్ని కనీస సమాచారం లేకుండా కూల్చివేయడం దారుణమని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 854 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రముఖశైవక్షత్రం.. ప్రభుత్వ పెద్దలు తమ వ్యక్తిగత ప్రచారానికి వాడుకుంటున్నారని విమర్శించారు. బుధవారం వేములవాడ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. మాట తప్పిన ఎమ్మెల్యే..గతంలో ప్రధాన ఆలయాన్ని ముట్టుకోమని, కేవలం పరిసరాల్లో మాత్రమే అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టమైన హామీ ఇచ్చారని లక్ష్మీనరసింహారావు గుర్తు చేశారు. కోనరావుపేట సభలోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించిన ఎమ్మెల్యే, ఇప్పుడు మాట తప్పి ప్రధాన గోపురాన్ని కూల్చివేయించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఆలయం ఏమైనా కాంగ్రెస్ పార్టీదా? లేక ఎమ్మెల్యే సొంత ఆస్తా? అని నిలదీశారు. క్యూలైన్ల ఎత్తు, గోపురం దర్శనం వంటి కనీస అంశాలపై కూడా పక్కా ప్రణాళిక, మాస్టర్ ప్లాన్ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.భక్తుల సౌకర్యాలు గాలికి..భక్తుల సౌకర్యార్థమే పనులు చేస్తున్నామని చెబుతున్నా,క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని చల్మెడ ఆరోపించారు. రద్దీ రోజుల్లో భక్తులు 10 నుంచి 12 గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోందని, వారికి కనీస మరుగుదొడ్లు, తాగునీరు, ప్రసాద వితరణ వంటి వసతులు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. తిరుపతి, యాదగిరిగుట్ట తరహాలో వెయిటింగ్ కంపార్ట్‌మెంట్లను నిర్మించకుండా, తూర్పు ద్వారాన్ని 250 అడుగుల దూరం జరిపి భక్తులు మరింత దూరం నడిచేలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
పురాతన వైభవానికి తూట్లు..నాగిరెడ్డి మండపం, అద్దాల మండపం, కోటిలింగాలు వంటి పురాతన రాతి కట్టడాలను తొలగించి, వాటి స్థానంలో ఆర్‌సీసీ (కాంక్రీట్) నిర్మాణాలు చేపట్టడం ద్వారా ఆలయ చారిత్రక వైభవాన్ని దెబ్బతీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయ నిర్మాణాలపై అవగాహన లేని ఆర్ అండ్ బీ (R&B) ఇంజినీర్లను రంగంలోకి దించారని, ఆలయ అర్చకులు, స్థానిక దేవాదాయ శాఖ ఇంజినీర్ల సలహాలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. అధికారులు, ఇంజినీర్లకు కాంట్రాక్టర్లే బ్రీఫింగ్ ఇచ్చే దుస్థితి నెలకొందన్నారు.అర్చకులపై ఒత్తిడి తగదు..గోపురం కూల్చివేతపై వివాదం చెలరేగడంతో, రాత్రికి రాత్రే కొందరు అర్చకులతో శాస్త్రోక్తంగానే పనులు జరుగుతున్నాయని ప్రకటనలు ఇప్పిస్తున్నారని చల్మెడ ఆరోపించారు. ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే ఒత్తిడి మేరకే వారు అలా మాట్లాడుతున్నారని, భవిష్యత్తులో ఏదైనా జరిగితే ఆ అర్చకులు బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు. జరుగుతున్న తప్పుపై అర్చకుల అంతరాత్మకు కూడా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు
🏠 Home