🏠 vemulawadavaartha.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 21 November 2026, 7:13 pm Posted by : VEMULAWADA VAARTHA

నా మతం సైన్స్, దానినే జీవితాంతం ఆరాధిస్తా... రామన్

News Image
  • పరిశోధనా మార్గంలో కాంతిరేఖ... రామన్
  • వైజ్ఞానిక శాస్త్రానికే వైద్యుడిలా మారిన విజ్ఞానయోధుడు... సర్ సి.వి.రామన్
  • నా మతం సైన్స్, దానినే జీవితాంతం ఆరాధిస్తా... రామన్
  • --విక్కుర్తి లక్ష్మీనారాయణ
  • ప్రధానోపాధ్యాయుడు
వేములవాడ,వీవీ న్యూస్
ప్రముఖ భారతీయ భౌతిక శాస్త్రవేత్త సి.వి. రామన్ 56వ వర్ధంతి సందర్భంగా ప్రాథమిక పాఠశాల న్యూ అర్బన్ కాలనీ వేములవాడలో రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ "సైన్స్ లో ఎవరూ చేయని సాహసాలను అత్యంత సునాయాసంగా చేధించి ప్రపంచ వినువీధిలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ధ్రువతార, పరిశోధనా మార్గంలో కాంతిరేఖ సర్ సి.వి. రామన్ అని, వైజ్ఞానిక రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నేలా భారత్ ను శక్తివంతంగా చూపి అబ్బురపరిచే ప్రయోగాలకు నిలువెత్తు వేదికలా సి.వి. రామన్ నిలిచారని, వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్ అందుకున్న కాంతిపుంజం, ప్రతిష్టాత్మక భారతరత్న అందుకున్న తొలి వైజ్ఞాన కెరటం, ఒక్క మాటలో చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రానికే వైద్యుడిలా మారిన విజ్ఞానయోధుడు, ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తుల్లో సి.వి. రామన్ మొదటి వాడని, విజ్ఞాన ఆవిష్కరణలో భారతీయులకు నోబెల్ రావడం గగనమని, అలాంటిది సర్ సివి రామన్ ఆ ఘనత సాధించారని, అంతేకాదు విజ్ఞాన శాస్త్రంలో ఆ ఘనత సాధించిన ఏకైక ఆసియా వాసిగానూ ఖ్యాతి గడించాడని, పరిశోధనల కోసం భారతీయులు విదేశాలకు వెళ్లడమేంటని, విదేశీయులే పరిశోధనల కోసం ఇక్కడికి రావాలని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి రామన్ అని, రామన్ ముందు వరకు సైన్స్ లో నోబెల్ బహుమతులు పాశ్చాత్యులకే దక్కేవని, కానీ రామన్ అచ్చమైన భారతీయునిగా ఈ గడ్డపైనే చదువుకొని తలమానికమైన పరిశోధన జరిపి సైన్స్ లో దేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పి భారత్ కు నోబెల్ బహుమతి సాధించిపెట్టారని, నా మతం సైన్స్ దానినే జీవితాంతం ఆరాధిస్తా అని చెప్పి తుది శ్వాస వరకు శాస్త్రాన్వేషణలోనే జరిపిన దార్శనికుడు సి.వి. రామన్ "అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గుర్రం బాలకిషన్, దుర్శేటి లక్ష్మీనారాయణ, కంకెల్కార్ మోహన్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు లిక్కిడి మంజుల, పులి శారద మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Additional News Photo
🏠 Home