హిత చింతక్ అభియాన్‌లో ప్రతి హిందువు భాగస్వామ్యం కావాలి
- వేములవాడలో రేపటి నుంచి ఇంటింటికీ సభ్యత్వ నమోదు
శనివారం వేములవాడలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ, నవంబర్ 22, ఆదివారం నుంచి వేములవాడ పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ హిత చింతక్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. హిందూ సమాజంలో ధార్మిక, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు, సమాజ హితం కోసం ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయడమే ఈ అభియాన్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
యువత, మహిళలు, మేధావులు, వ్యాపారులు, ఉద్యోగులు, ప్రతి కుటుంబం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హిత చింతక్ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. సభ్యత్వ నమోదు కోసం కార్యకర్తలు ఇంటింటికీ వచ్చినప్పుడు ప్రజలందరూ సానుకూలంగా స్పందించి సహకరించాలని, ఈ అభియాన్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో గడప కిషోర్ రావు, నాగుల రాము, గన్నమనేని ప్రదీప్ రావు, పల్లె శ్యాంసుందర్ రెడ్డి, గుండోజు గోపాల్, సనుగుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.