🏠 vemulawadavaartha.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 23 November 2026, 7:49 pm Posted by : VEMULAWADA VAARTHA

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో రేపు ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపివేత

News Image
  • మల్యాల,వీవీ న్యూస్
  • భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం నిర్ణయం.. ప్రత్యేక దర్శనాలు యథావిధిగా కొనసాగింపు.
జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి దేవస్థానంలో రేపు (నవంబర్ 24) కార్తీక పౌర్ణమి, కొండగట్టు గిరి ప్రదక్షిణ, మంగళవారం మరియు స్వామివారి నిజరూప దర్శనం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.భక్తుల సౌకర్యార్థం, రద్దీ నియంత్రణలో భాగంగా రేపు నిర్వహించాల్సిన ఆర్జిత సేవలైన అభిషేకాలు, వ్రతం, కుంకుమ పూజలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది.అయితే భక్తులకు రూ.100/-,ప్రత్యేక దర్శనం,రూ.300/-,అతి శీఘ్ర దర్శనంతో పాటు ధర్మదర్శనం యథావిధిగా అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. వాహన పూజలను ప్రస్తుతం నిర్వహిస్తున్న స్థలం నుంచి మార్చి వై జంక్షన్ వద్ద నిర్వహించనున్నారు.అంతరాలయ దర్శనాలకు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.భక్తులు ఈ మార్పులను గమనించి దేవస్థాన అధికారులకు సహకరించాలని కోరారు. తిరిగి నవంబర్ 25 నుంచి ఆర్జిత సేవలు, అంతరాలయ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని పీఆర్వో తెలిపారు.
మరింత సమాచారం కోసం సంప్రదించండి సెల్:9491000653, 8333800720.
🏠 Home