- రుద్రంగి మండల కేంద్రంలో అహ్లాద పర్వతంపై ఆధ్యాత్మిక వైభవం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని రుద్రంగి మండలంలో అహ్లాద పర్వతంపై కొలువుదీరిన శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్య కల్యాణ మహోత్సవం భక్తి, ఆధ్యాత్మికతతో వైభవంగా సాగింది. స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు..