బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార ప్రతినిధిగా రేగుల శ్రీకాంత్
- వేములవాడ,వీవీ న్యూస్
పార్టీ బలోపేతానికి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకంగా పనిచేయడంతో పాటు, మున్సిపల్ ఎన్నికల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఆయన సేవలను గుర్తించిన పార్టీ నాయకత్వం ఈ బాధ్యతలు అప్పగించింది.
ఈ నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తూ..రేగుల శ్రీకాంత్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్,రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి,రాష్ట్ర అధికార ప్రతినిధి,వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చెన్నమనేని వికాస్ రావు సహకారంతో నియామకమయ్యారు.