🏠 vemulawadavaartha.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 12:21 pm Posted by : VEMULAWADA VAARTHA

మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన ‘ఫూలే’ సినిమా హీరో ప్రతీక్ గాంధీ

News Image
  • మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను నేటి సమాజానికి చాటిచెప్పే చిత్రం ‘ఫూలే’ -మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్,వీవీ న్యూస్
మహాత్మా జ్యోతిబా పూలే జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘ఫూలే’ (PHULE - 2025) సినిమా నేటి సమాజానికి ఆదర్శప్రాయమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
గురువారం మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ‘ఫూలే’ సినిమా హీరో ప్రతీక్ గాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే జీవిత చరిత్రను, ఆయన సామాజిక ఉద్యమాలను వెండితెరపై ఆవిష్కరించిన సినిమా బృందాన్ని మంత్రి అభినందించారు. హీరో ప్రతీక్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు.మహాత్మా జ్యోతిబా పూలే కులవివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని, మహిళల విద్య కోసం విశేష కృషి చేశారని మంత్రి గుర్తుచేశారు. బాలికల విద్యకు పాఠశాలలు ప్రారంభించడం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఉద్యమించడం, 1873లో సత్యశోధక సమాజాన్ని స్థాపించడం వంటి ఆయన చారిత్రాత్మక కార్యాచరణను ఈ సినిమాలో చూపించారని పేర్కొన్నారు.సమానత్వం, సామాజిక న్యాయం,విద్యా హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలు నేటికీ సమాజానికి మార్గదర్శకమని,ముఖ్యంగా బీసీల అభ్యున్నతి, సామాజిక సమానత్వం,విద్యా సాధికారతకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం కూడా మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాల స్ఫూర్తితో సామాజిక న్యాయం, బీసీల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.ఇప్పటికే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ‘ఫూలే’ సినిమాను వీక్షించి సినిమా బృందాన్ని అభినందించారని తెలిపారు.నేటి నుంచి తెలంగాణలో ‘ఫూలే’ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.కార్యక్రమంలో సినిమా తెలుగులో అనువదించిన డాక్టర్ పొన్నం రవిచంద్ర, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు Additional News Photo
🏠 Home