🏠 vemulawadavaartha.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 8:37 pm Posted by : VEMULAWADA VAARTHA

రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కు బండి సంజయ్ ఫోన్..అమృతకు ఇల్లు మంజూరు చేసిన కలెక్టర్

News Image
  • ఇప్పటికే అమృతకు ఆర్ధిక సాయం అందించిన కేంద్ర మంత్రి
  • నిత్యావసర సరుకులతోపాటు అమృతకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు ఆదేశం
రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్
సొంత ఇల్లు లేక స్మశానమే నివాసంగా మార్చుకుని అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడితో కలిసి దుర్భర జీవితాన్ని గడుపుతున్న చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన మర్రిపల్లి అమృతకు ఇల్లు మంజూరైంది. అమృతకు దీన స్థితికి చలించిపోయిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆమెకు బాసటగా నిలిచారు. అమృతకు తక్షణ సాయంగా ఇటీవల రూ.50 వేలు పంపారు. దీంతోపాటు జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ కి ఫోన్ చేసి అమృతకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. బండి సంజయ్ సూచనతో జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ ఈరోజు అమృతను పిలిచి ఇల్లు మంజూరు పత్రాన్ని అందజేశారు. మరోవైపు అనారోగ్యం బారిన పడిన కొడుకుతో కలిసి శ్మశానంలో నివసిస్తూ పుట్టెడు దుఃఖంలో ఉన్న అమృతకు అన్ని విధాలా అండగా ఉండాలని బండి సంజయ్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరైన వెంటనే ఆ ఇంటికి అవసరమైన సామాగ్రితోపాటు కుటుంబానికి సరిపడా నిత్యావసర సరుకులను అందించాలని కోరారు. Additional News Photo
🏠 Home