వేములవాడ డివిజన్ మాల మహానాడు కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
- డివిజన్ కన్వీనర్‌గా బొల్లం దేవరాజు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన మాల మహానాడు సమావేశంలో వేములవాడ డివిజన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ మాల మహానాడు, జిల్లా మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా ఐక్యవేదిక అధ్యక్షుడు తుంగ శివరాజు సమక్షంలో నూతన కమిటీని ప్రకటించారు. డివిజన్ కన్వీనర్‌గా బొల్లం దేవరాజు, కో-కన్వీనర్‌గా నీరటి కిరణ్ కుమార్, యూత్ అధ్యక్షుడిగా రొండి మధుకర్, మీడియా ఇన్‌చార్జిగా సంటి రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా తిక్కల నవీన్ కుమార్, కన్వీనర్‌గా పండుగ నిరంజన్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తుంగ దేవరాజు మాట్లాడుతూ మాలలంతా ఐక్యంగా ఉంటూ హక్కుల సాధనకు కృషి చేయాలని, సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. నూతన కమిటీ సంఘ అభివృద్ధికి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అనంతరం నూతన డివిజన్ కన్వీనర్ బొల్లం దేవరాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మాలల ఐక్యత, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు జక్కుల యాదగిరి, నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల కమలాకర్, జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు నీరటి శ్రీనివాస్, చందుర్తి మండల అధ్యక్షుడు ఏసు కుమార్, కోనరావుపేట మండల అధ్యక్షుడు మందాల శ్రీనివాస్, వివిధ మండలాల ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.