🏠 vemulawadavaartha.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 28 November 2026, 10:16 pm Posted by : VEMULAWADA VAARTHA

పూలే సిద్ధాంతాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి

News Image
కొత్తపల్లి,వీవీ న్యూస్
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం మోదుంపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, మహిళా విద్య, కుల వివక్ష నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. సమానత్వం, విద్య, సామాజిక న్యాయం అనే పూలే సిద్ధాంతాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మోదుంపల్లి శ్రీకాంత్, గర్రెపల్లి వెంకటేష్, తాండ్ర మైపాల్, రాచకొండ రవి, కంకణాల రమేష్, తాండ్ర రాజు, తిరుపతి, పోలుదాసరి శరత్, వేములవాడ శ్రీకాంత్, రాచకొండ శీను, బత్తిని గణేష్, మాస గోని రమేష్, గర్రెపల్లి వినయ్, మాస గోని సన్నీ, కోడూరి శేఖర్, వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
🏠 Home