శ్రీ సిద్ధిదా అలంకారంలో శ్రీరాజరాజేశ్వరిదేవి అమ్మవారు

ముఖ్యమైన పాయింట్స్:భీమన్న గుడిలో శ్రీ సిద్ధిదా అలంకారంలో శ్రీరాజరాజేశ్వరిదేవి అమ్మవారు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.సోమవారం తొమ్మిదవ రోజు శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారు శ్రీ సిద్ధిదా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.రాజన్న గుడి నిర్మాణం చేస్తున్న తరుణంలో ఏకాంతంగా పూజలు చేస్తున్నట్లు రాజన్న ఆలయ అర్చకులు చెబుతున్నారు.ఈవో రమాదేవి ప్రత్యేక పూజలు చేసి సేవలో తరించారు.అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.