జన గణన సమాచారం పక్కాగా సేకరించాలి: ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ముఖ్యమైన పాయింట్స్:రెండో దశ జనాభా గణనపై ఛార్జ్ ఆఫీసర్లు, అదనపు ఛార్జ్ ఆఫీసర్లకు ఐడీఓసీలో శిక్షణ రాజన్న సిరిసిల్ల,వీవీ న్యూస్ జన గణన సమాచారం క్షేత్రస్థాయిలో నాణ్యతతో పక్కాగా సేకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్,జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.భారత జనగణన–2027లో భాగంగా రెండో దశ జనాభా గణన (Population Enumeration) నిర్వహణపై ఛార్జ్ ఆఫీసర్ల(తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, అదనపు ఛార్జ్ ఆఫీసర్లు ఎంపీడీఓల)కు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.జనాభా గణన రెండో దశను సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, క్షేత్రస్థాయిలో గణన ప్రక్రియ అమలు, గణన సిబ్బంది విధులు, బాధ్యతలు, జనాభాకు సంబంధించిన వివరాల...