ఫాజుల్ నగర్‌లో బీజేపీ టిఫిన్ బైఠక్ కార్యక్రమం

ముఖ్యమైన పాయింట్స్:తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి: జక్కుల తిరుపతినవంబర్ 5న బండి సంజయ్ నిర్వహించే జెన్ జెడ్ యువత ర్యాలీని విజయవంతం చేయాలి రాజన్న సిరిసిల్ల,వీవీన్యూస్ వేములవాడ రూరల్ మండలం వట్టెంల శక్తి కేంద్రం పరిధిలోని ఫాజుల్ నగర్ గ్రామంలో బీజేపీ నాయకులు,కార్యకర్తలతో కలిసి టిఫిన్ బైఠక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేయడంపై నాయకులు చర్చించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కౌన్సిల్ సభ్యుడు జక్కుల తిరుపతి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి...